బిడ్డ‌ను కోల్పోయింది 1 m ago

featured-image

ఒడిషా జిల్లాలోని కేంద్ర‌ప‌రా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గుర‌వ‌డంతో స్వ‌యంగా మంత్రి జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. కేంద్ర‌ప‌రా జిల్లాలో ఓ 26 ఏళ్ల ప్ర‌భుత్వ ఉద్యోగిగా ప‌నిచేస్తున్న బ‌ర్షా ప్రియ‌ద‌ర్శిని అనే మ‌హిళ గ‌ర్భం దాల్చింది. తాను గ‌ర్భం దాల్చి ఏడో నెల వ‌చ్చిన సంద‌ర్భంగా తాను ఆసుప‌త్రికి వెళ్లేందుకు డెరాబిస్ బ్లాక్‌లోని సీడీపీఓ స్నేహ‌లా సాహును సెల‌వు అడిగిన‌ప్ప‌టికీ ఆమె ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో తాను గ‌ర్భం పోగొట్టుకున్నాన‌ని ప్రియ‌ద‌ర్శిని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఈ ఘటన ఒడిషాలో తీవ్ర దుమారం రేపడంతో సాహూను తన పదవి నుంచి తొలగించినట్లు ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా తెలిపారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ క్ర‌మంలో దీనిపై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని డెరాబిస్ బీడీఓ అనిరుధా బెహెరా తెలిపారు.


మూడేళ్లుగా హింస‌

గత మూడేళ్లుగా సీడీపీఓ త‌న్ను చిత్రహింసలకు గురిచేస్తుంద‌ని ప్రియ‌ద‌ర్శిని ఆరోపిస్తున్నారు. తాను గర్భం దాల్చిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. దాని ప్రభావం త‌న‌ బిడ్డపై ప్రత్యక్ష ప్రభావం చూపి మరణానికి దారితీసిందంటూ ఆవేద‌న వ్య‌క్తంచేశారు. ఈక్ర‌మంలోనే తాను చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని, కానీ తాను ఇప్పటికీ అక్కడే పని చేస్తున్నానని ప్రియదర్శిని చెప్పారు. ఆఫీస్‌లో పని చేస్తున్నప్పుడు తనకు తీవ్రమైన ప్రసవ నొప్పి వచ్చిందని ప్రియదర్శిని పేర్కొంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించాల్సిందిగా సీడీపీఓ స్నేహలతా సాహూ, ఇతర సిబ్బందిని కోరిన‌ప్ప‌టికీ సీడీపీవో త‌న విజ్ఞ‌ప్తిని పట్టించుకోలేదని వాపోయారు.

కుటుంబ స‌భ్యుల స‌హ‌కారంతో

చేసేదేమీ లేక‌ ఆమె కుటుంబ సభ్యులకు స‌మాచారం అందిచ‌డంతో వారు కార్యాలయానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారని ప్రియ‌ద‌ర్శిని చెబుతున్నారు. అయితే చికిత్సకు వెళ్ళే సమయానికే కడుపులోనే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. తను బిడ్డ‌ను కోల్పోయేలా చేసిన సీడీపీఓపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌, సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌లకు ప్రియదర్శిని ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో హ‌ల్ చేయ‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేశారు.

త‌న‌నెప్పుడూ అడ‌గ‌లేదు

ఇదిలా ఉండ‌గా సీడీపీవో ఈ విష‌యంపై స్పందించారు. ప్రియ‌ద‌ర్శిని చేసిన‌ ఆరోపణలను ఖండించారు. ప్రియదర్శిని ఎప్పుడూ సెలవు కోసం దరఖాస్తు చేయలేదని పేర్కొన్నారు. తాను ఆమెను ఎప్పుడూ వేధించలేదని తెలిపారు. ఆమె అబద్ధం చెబుతోందంటూ చెప్పుకొచ్చారు. ఆమె కుటుంబ సభ్యులు త‌న‌తో అనుచితంగా ప్రవర్తించారని, త‌న‌తో మాట్లాడేప్పుడు సెల్‌ఫోన్‌లో వీడియోలు తీశార‌ని వివ‌రించారు. వీడియో ఎడిట్ చేశార‌ని ఆరోపించారు.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD